అంటున్న ‘కొలాం’
సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.
సాత్నాల మండలం జామినిలో ఈనెల 10న కట్నం లేకుండా నిర్వహించిన ‘కొలాం’ వివాహ వేడుక


