న్యూస్‌రీల్
నిర్మల్
7
నీతి ఆయోగ్
‘బెస్ట్ ప్రాక్టీసెస్’కు పెంబి
నిర్మల్‌చైన్‌గేట్: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద నిర్వహించే ‘బెస్ట్ ప్రాక్టీసెస్’ సెమినార్‌కు జిల్లాలోని పెంబి ఆస్పిరేషనల్ బ్లాక్ ఎంపికై నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగే ఉన్నతస్థాయి సెమినార్‌లో పెంబి బ్లాక్ సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలకరంగాల్లో పెంబి మండలం గణనీయమైన పురో గతి సాధించినందుకు ఈ అవకాశం దక్కిందని వివరించారు. రాష్ట్రం నుంచి నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు మాత్రమే ఈ సెమినార్‌కు ఎంపిక కాయ్యాయని తెలిపారు. పెంబి బ్లాక్‌లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ వేదికపై ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.
లక్ష్మణచాంద: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా నిధుల దుర్వినియోగం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో పథకంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ అటెండెన్స్ ప్రవేశపెట్టారు. ఇక నకిలీ హాజరు నమోదుకు చెక్ పెట్టేందుకు పనులకు హాజరయ్యే కూలీలకు ముఖగుర్తింపు హాజరు(ఎఫ్‌ఆర్‌ఎస్) చేస్తున్నారు. మార్చి 2 నుంచి కొత్త యాప్‌లో కూలీల హాజరు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. కూలీల హాజరు తీసుకునే సమయంలో కూలీ ఫొటో, ఈకేవైసీ ప్రక్రియలో పొందుపరిచిన ఫొటో ఒకేలా ఉంటేనే హాజరు నమోదవుతుంది.
నూతన యాప్‌తోనే...
గతేడాది ఆగస్టు నుంచి ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో జిల్లాలోని కూలీల ఈ కేవైసీ ప్రక్రియ ఉపాధి హామీ సిబ్బంది పూర్తి చేశారు. తర్వాత ఎన్‌ఎంఎంఎస్ నూతన యాప్‌ను క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు, మేట్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ నూతన యాప్‌లో కూలీల హాజరును నమోదు చేస్తున్నారు.
నమోదు ఇలా..
పని ప్రదేశానికి వెళ్లిన క్షేత్ర సహాయకులు ముందుగా యాప్‌లో పనులకు వచ్చిన వ్యక్తి పని ఐడీ నంబర్ ఎంచుకుని మస్టర్‌లో కనిపించే పేర్లపై కూలీ ఫోటో తీసి నమోదు చేస్తున్నారు. అప్పుడు ఈ కేవైసీ సందర్భంగా తీసిన ఫొటో ప్రస్తుతం తీసిన ఫొటో ఒకరిదే అయితే కూలీ హాజరు నమోదు అవుతుంది. అలాగే పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కూలీ పనులకు వచ్చిన మొత్తం సభ్యుల గ్రూపు ఫొటో మరోసారి తీసి యాప్‌లో నమోదు చేస్తారు. ఇలా రెండుసార్లు ఫొటో తీసి ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియ ద్వారా నిత్యం కూలీ పనులకు వచ్చేవారి హాజరును నమోదు చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదుతో కూలీలకు డబ్బులు చెల్లింపు సమయంలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు అంటున్నారు.
గతంలో అనేక సంఘటనలు..
జిల్లా వ్యాప్తంగా 1,74,318 జాబ్ కార్డులు ఉన్నాయి. 3,20,936 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 88,475 యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. గతంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఒకరికి బదులు మరొకరు పనులకు వెళ్లి హాజరు వేసుకున్నారు. అనంతరం చేపట్టిన సామాజిక తనిఖీల్లో పలుమార్లు ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధ్యుల నుంచి నిధులు రికవరీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన యాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో నకిలీ హాజరు నమోదకు ఆస్కారం ఉండదని అధికారులు అంటున్నారు.
జిల్లా సమాచారం...
జిల్లాలో మొత్తం జీపీలు 400
మొత్తం జాబ్ కార్డులు 1,74,318
మొత్తం కూలీల సంఖ్య 3,20,936
యాక్టివ్ జాబ్ కార్డులు 88,475


