నిర్మల్ టౌన్: నిర్మల్ నుంచి ఆర్టీసీ బస్సు అన్నవరం, సింహాచలం, అరసవెల్లి, కోణార్క్ మీ దుగా పూరికి ఆదివారం బయల్దేరింది. డిపో మేనేజర్ పండరీ బస్సును ప్రారంభించారు. ఈ యాత్ర ఆరు రోజులు కొనసాగుతుందని తెలిపారు. ఏప్రిల్‌లో అయోధ్య, కాశీ, గోవాకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ దేవపాల, సిబ్బంది శకుంతల, విజీ.రెడ్డి, రమణ, భక్తులు పాల్గొన్నారు.
లక్కీ స్కీం నిర్వాహకులపై చర్య తీసుకోవాలి
ఖానాపూర్: లక్కీ స్కీం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్న నిర్వాహకులపై చర్య తీసుకోవాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్ డిమాండ్ చేశారు. పట్టణ పరిధిలోని వ్యాపార సముదాయాన్ని విక్రయించేందుకు లక్కీ డ్రా పేరుతో బంపర్ ఆఫర్ పెట్టి మోసం చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లక్కీ డ్రా పేరుతో నిర్వాహకులు మోసం చేశారని బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేవలం ఒకరిపై నామమాత్రపు కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రూ.వేయి చొప్పున వసూలు చేసిన వారందరికీ డబ్బులు తిరిగి ఇప్పించాలన్నారు.


