న్యూస్‌రీల్
పదేళ్ల తర్వాత నిధులు కేటాయించిన ప్రభుత్వం జిల్లాకు రూ.16.30 లక్షలు విడుదల రైతులకు పలు కార్యక్రమాల నిర్వహణ
రైతు శిక్షణలు
రైతుల పొలాల్లో క్షేత్ర ప్రదర్శనలు
రైతుల క్షేత్ర సందర్శనలు
కిసాన్ మేళాలు
ఎగ్జిబిషన్లు
రైతు–శాస్త్రవేత్తల ఇష్టాగోష్టిలు
ఆత్మవిశ్వాసమే ఆయుధం
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చు.
సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మణచాంద: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కేజీబీవీలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ కేజీబీవీ, యూఆర్‌ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో 29 రోజులు సమ్మె చేశామన్నారు. అలాగే మినిమం టైం స్కేల్ చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలనానరు. ఇందులో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, కేజీబీవీ ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానంతోపాటు పంటల సాగు, అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)కు ప్రభుత్వం ఊపిరి పోసింది. నిధుల లేమితో పదేళ్లుగా నిస్తేజంగా ఉన్న ఆత్మకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు కేటాయించింది. దీంతో తిరిగి రైతు శిక్షణ కార్యక్రమాలు, కిసాన్ మేళాలు, విజ్ఞాన యాత్రలు, క్షేత్ర పర్యటనలు కొనసాగించే అవకాశం ఏర్పడింది.
కమిటీల ఏర్పాటు..
ఆత్మ పథకంలో భాగంగా ఏర్పాటు చేసే గవర్నింగ్ బోర్డు మూడు నెలలకోసారి సమావేశమై ప్రగతి నివేదికలను సమీక్షిస్తుంది. అవసరమైన బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. బ్లాక్ స్థాయిలో ఆత్మ కింద ఫార్మర్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వయిజరీ సెంటర్ ఏర్పాటు చేస్తారు. జిల్లాలోని వ్యవసాయ డివిజన్లలో వ్యవసాయ సహాయ సంచాలకులు కన్వీనర్‌గా ఉంటారు. ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఎఫ్‌ఏసీ (ఫార్మర్ అడ్వయిజరీ కమిటీ)ల్లో 11 నుంచి 15 మంది మహిళలు, రైతు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. నెలకోసారి సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటుంది.
రైతులకు ప్రయోజనం..
ఈ సంస్థ ద్వారా బ్లాక్, జిల్లా స్థాయిలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతులను వ్యవసాయ విజ్ఞాన యాత్రలకు పంపించి పంట క్షేత్రాలను పరిశీలింపజేస్తారు. కిసాన్ గోష్టి నిర్వహిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు తెలుపుతారు. ప్రస్తుతం వ్యవసాయం ఆధునిక పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో విజ్ఞాన యాత్రలు రైతులకు మేలు చేయనున్నాయి. ఏ ప్రాంతంలో వ్యవసాయంలో ఎలాంటి పరికరాలు వాడుతున్నారు, అవి తమ ప్రాంతాల్లో వాడొచ్చా అనే విషయాన్ని రైతులు తెలుసుకుంటారు.
వ్యవసాయ అధికారే
ఇన్‌చార్జి..
నిర్వహించే కార్యక్రమాలు..
జిల్లాల విభజన తర్వాత ఆత్మ పథకానికి నిధులు నిలిచిపోవడంతో వాటి ద్వారా నిర్వహించే కార్యక్రమాలు కూడా నిలిచి పోయాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులనే ఇన్‌చార్జిగా నియమించింది. ఆత్మ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కేటాయించగా.. జిల్లాకు సుమారు రూ.16.30 లక్షలు కేటాయించారు.
నిధులు వచ్చాయి..
ఆత్మ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.16.30 లక్షలు మంజూరయ్యాయి. కలెక్టర్ అనుమతి తర్వాత కార్యక్రమాలు చేపడతాం. ఇక నుంచి రైతులకు విస్తృత సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే ఆత్మ సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి.
– అంజి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి


