హక్కుల కోసం సంఘటితం కావాలి | - | Sakshi
Sakshi News home page

హక్కుల కోసం సంఘటితం కావాలి

Mar 10 2026 7:13 AM | Updated on Mar 10 2026 7:13 AM

భైంసారూరల్‌: శ్రామిక మహిళల ఉపాధిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, సమాజంలో ఉన్న పురుషాధిపత్య ధోరణులకు ఎదు రు నిలవాలంటే మహిళలు సంఘటితంగా ఉ ద్యమించాలని పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి హరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా పోరా ట దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మండలంలోని హంపోలి గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న అన్యాయాలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. శ్రామిక మహిళలకు సముచిత ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వారి హక్కులను పరిరక్షించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు లక్ష్మి, రుక్మ, గంగమణి, సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement