సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

Mar 10 2026 7:13 AM | Updated on Mar 10 2026 7:13 AM

● అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజావాణికి వచ్చిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణి అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సూచించారు. త్వరలోనే పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్లి, విద్యార్థులతో మాట్లాడి వారికి సూచనలు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement