నిర్మల్ టౌన్: నిర్మల్‌లో కొత్త పోలీస్ ఔట్‌పోస్ట్ ప్రారంభించాలని ఎస్పీ జానకీషర్మిల నిర్ణయించారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణం వేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుతోంది. దీంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యం పట్టణ విస్తరణకు తగినట్లుగా ఎస్పీ భద్రతా చర్యలను బలోపేతం చేశారు. పోలీస్ ఔట్‌పోస్ట్ ద్వారా ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించనున్నారు.
పాత భరోసా కేంద్రంలో..
జిల్లా పోలీస్ కార్యాలయం ఎదురుగా ఉన్న పా త భరోసా కేంద్రంలో టౌన్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. పట్టణ కాలనీల్లో ట్రాఫిక్, చిన్న వివాదాలు, చట్ట సంబంధిత అంశాలను త్వరగా పరిష్కరిస్తారు. స్థానికులకు సేవలు సులభంగా చేరుకునేలా రూపొందించారు.
ఔట్‌పోస్ట్ కవరేజీ ప్రాంతాలు
నిర్మల్ పట్టణంలోని 23 ప్రాంతాలు ఈ ఔట్‌పోస్ట్ పరిధిలోకి వస్తాయి. గాజుల్‌పేట్, బర్కత్‌పూర్, లక్ష్మీనగర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, ప్రియదర్శిని నగర్, ఎన్‌టీఆర్ మార్గ్, జోహ్రానగర్, ఈద్గాం, ఆదర్శనగర్, సిద్ధాపూర్, రామ్‌నగర్, విద్యానగర్, సోఫీనగర్, భాగ్యనగర్, రూరల్ స్టేషన్ ప్రాంతాలు, కోర్టు ఏరియా, మున్సిపల్, ఆర్‌డీఓ కార్యాలయాలు, పంజేష్‌గల్లీ, గోల్డెన్ ఫంక్షన్ హాల్, తిరుమల థియేటర్, సాగర్ కాలనీ, నటరాజ్‌నగర్. ఔట్‌పోస్టుకు టౌన్ సీఐ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ముగ్గురు ఎస్సై, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.
టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి..
నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్, బుధవార్‌పేట్, కచ్చి కాలనీ, కబూతర్‌కమాన్, గాంధీచౌక్, నాయుడువాడ, కాల్వగడ్డ, బేస్తవార్‌పేట్, దోబీగల్లి, బంగ్లాపేట్, ధ్యాగావా డ, బ్రహ్మపురి, వెంకటాద్రిపేట్, సోమవార్‌పే ట్, పింజారిగుట్ట, అత్తర్ గల్లి, ఓల్డ్ బస్టాండ్, షే క్స్ పేట్, బైల్ బజార్, సోనార్ గల్లీ (చింతకుంట వాడ), ఇస్లంపుర, కురాన్నపేట్, కోలి బండ, బాగులవాడ, ఇంద్రనగర్, బోయివాడ, గొల్ల పేట్, శాసీ్త్రనగర్, దత్తాత్రేయ నగర్, ఏఎన్ రెడ్డి కాలనీ, దివ్య నగర్, శాంతినగర్, వెంకటాపూర్, చైన్‌గేట్, పాన్‌గల్లీ టౌన్‌వన్‌లోకి వస్తాయి.
వేగవంతమైన సేవల కోసం..
ప్రజలకు మరింత వేగవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు నిర్మల్ టౌన్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేశాం. దీంతో ప్రజలకు సౌకర్యవంతమైన పోలీసు సేవలు, కేసులు, ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించవచ్చు. ఈ మార్పును ప్రజలు గమనించి, తమకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదులను ఏ స్టేషన్ పరిధిలోకి వస్తాయో.. చూసుకుని సంప్రదించాలి. – జానకీషర్మిల, ఎస్పీ


