నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Mar 7 2026 7:23 AM | Updated on Mar 7 2026 7:23 AM

శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

బందీఖానాగా మార్చాల్సిందే..

ఇది ఇల్లా.. లేక జైలా..! ఇలా చుట్టూ ఇనుప కట్టడి చేశారు అన్న అనుమానం వస్తుంది కదా! ఇది కూడా కోతులను అడ్డుకోవడానికే. పచ్చని మొక్కలను నాశనం చేయడమే కాదు, ఇంట్లోకి చొరబడి నానాహంగామా చేస్తుండటంతో జిల్లాకేంద్రంలో ఇలా ఇంటిని బందీఖానాలా మార్చుకోవాల్సి వస్తోంది.

వల వేసుకోవాల్సిందే...

జిల్లాకేంద్రంలోని ప్రియదర్శినినగర్‌కు చెందిన సంతోష్‌ రోజూ కిరాణాషాప్‌ తీయగానే ముందుగా చుట్టూ వల వేస్తుంటారు. ఎందుకంటే.. ఏ వైపు నుంచి ఏ కోతి దుకాణంలోకి చొరబడుతుందో తెలియదు. డబ్బాలను, ప్యాకెట్లను ఎప్పుడు ఎత్తుకెళ్తుందో చెప్పలేం. అందుకే ఇలా జాలిలు, వలలతో దుకాణాన్ని కాపాడుకుంటున్నాడు. నిర్మల్‌లో గల్లీల్లోని ఏ దుకాణం చూసినాఇలాంటి రక్షణ చర్యలే కనిపిస్తాయి.

కొండెంగ ఫొటో పెట్టాల్సిందే..

ఏంటిదీ..!? కొండెంగ ఫొటోను ఇలా ఇంటి గేట్‌కు పెట్టుకున్నారు..!? అని ఆశ్చర్యపోకండి. నిర్మల్‌లో ప్రస్తుతం చాలామంది తమ ఇళ్ల ముందు ఇలా కొండెంగల ఫొటోలు పెట్టుకుంటున్నారు. కోతులు చేసే చేష్టలను, అవి చేసే నష్టాలను కట్టడి చేసేందుకు. కొండెంగలు ఉన్న చోటుకు కోతులు రావన్న ఉద్దేశంతో ఇదిగో ఇలా ‘కొండెంగ ప్రయత్నం’ చేస్తున్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement