ఖానాపూర్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖనాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ నుంచి గెలిచిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును శుక్రవారం కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కార్యక్రమంలో అంకం మౌనిక, మహేందర్, బండిపెల్లి సింధూజ, ప్రకాశ్, గుమ్ముల అశోక్, బొప్పారపు సత్యవతి ఉన్నారు.


