వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.
రంజాన్ కానుకలొచ్చాయ్
నిర్మల్‌చైన్‌గేట్: రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు అందజేసేందుకు ప్రభుత్వం కానుకలు సిద్ధం చేసింది. పండుగ సమీపిస్తుండడంతో రంజాన్ తోఫాలు జిల్లాలకు పంపుతోంది. జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి తోఫా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
3 వేల కుటుంబాలకు తోఫా
రంజాన్ కానుకలు జిల్లాలో 3 వేల కుటుంబాల కు అందించాలని అధికారులు గుర్తించారు. నిర్మల్ నియోజకవర్గంలో 1000, ముధోల్‌లో 1,250, ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో 750 కుటుంబాలకు ఈ కానుకలు అందించనున్నారు. రంజాన్ తోఫా కింద కుటుంబంలోని భార్యాభర్తతోపాటు వారి పిల్లలకు నూతన దుస్తులు అందించనున్నారు. ఇందులో పాయింట్, షర్ట్, చుడీదార్, చీర, జాకెట్ ఉంటాయి.
ఇఫ్తార్ విందుకు నిధులు..
రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం జిల్లాకు రూ.12 లక్షలు మంజూరు చేసింది. నిర్మల్ నియోజకవర్గానికి రూ.4 లక్షలు, ముధోల్‌కు రూ.5 లక్షలు, ఖానాపూర్‌కు రూ.3 లక్షల చొప్పున మంజూరు చేసింది. నిర్మల్‌లో 4, ముధోల్‌లో 5, ఖానాపూర్‌లో 3 ప్రాంతాల్లో 500 మంది చొప్పున ఇఫ్తార్ విందు ఇస్తారు.
లబ్ధిదారులు, నిధుల వివరాలు
నియోజకవర్గం లబ్ధిదారులు ఇఫ్తార్
నిధులు
నిర్మల్ 1,000 రూ.4 లక్షలు
ముధోల్ 1,250 రూ.5 లక్షలు
ఖానాపూర్ 750 రూ.3 లక్షలు


