● అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నిర్మల్‌టౌన్: ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో మంగళవారం పర్యటించారు. కాలనీలలో తడి, పొడి చెత్త ను వేర్వేరుగా సేకరించడం వల్ల కలిగే ప్ర యోజనాలను ప్రజలకు వివరించారు. పట్ట ణంలో పరిశుభ్రత కోసం తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, డీఈ హరిభూశణ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


