ఉడుంపూర్‌లో పర్యటించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు
కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హు స్సేన్‌నాయక్ ఆదివారం పర్యటించారు. బీజేపీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్‌యాదవ్ హుస్సేన్ నాయక్‌కు గొంగడి కప్పి, గొర్రెపిల్లను అందించి స్వాగతం పలికారు. లక్ష్మీపూర్ ఎత్తి పోతల పథకాన్ని ఉడుంపూర్ వరకు పొడిగించాలని, మిద్దెచింత గ్రామానికి విద్యుత్, గండిగోపాల్‌పూర్‌కు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం క ల్పించాలని కోరారు. ఐటీడీఏ డీడీ అంబాజీ, శం కరయ్య, శేఖర్, పరంధాములు, శారద, బ క్కయ్య, విజేశ్, విజయ్, శ్రీను ఉన్నారు.


