దోపిడీలు చేస్తున్న ముఠా అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: సెల్‌ఫోన్లు దోపిడీ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్, రిమ్స్‌లో ఈ గ్యాంగ్ దోపిడీకి పాల్పడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 26న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితుడు సగుడారపు కనిష్క్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈనెల 15న రైల్వే స్టేషన్‌లో పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డుపై నలుగురు వ్యక్తులు అడ్డగించి కనిష్క్ వద్ద డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించారని తెలిపారు. డబ్బులు లేకపోవడంతో మొబైల్ ఫోన్ లాక్కున్నారన్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఒకరు మైనర్ ఉన్నారని తెలిపారు. నిందితుల్లో పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన సయ్యద్ నవీద్, వడ్డెరకాలనీకి చెందిన మీర్జా ముషారప్ బేగ్, షేక్ బిలాల్, ఖానాపూర్‌కు చెందిన షేక్ అర్షద్, నెహ్రునగర్‌కు చెందిన బాన్సోడే కిషన్, భుక్తాపూర్‌కు చెందిన మైనర్ బాలుడు ఉన్నట్లుగా తెలిపారు. గతంలో వీరిపై పలు స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లుగా తెలిపారు. వీరు బస్టాండ్, రైల్వేస్టేషన్, రిమ్స్ పరిసర ప్రాంతాల్లో దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.


