ఎన్‌ఎంఎంఎస్‌లో మెరిశారు
లక్ష్మణచాంద: ప్రతిభ ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చదువులో ఉముందున్న పేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తప్పించేందుకు ఏటా జాతీయస్థాయిలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన 5 వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందనున్నాయి.
జిల్లా నుంచి 70 మంది అర్హత..
గత నవంబర్‌లో నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో 70 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులకు ప్రతీ సంవత్సరం రూ.12 వేల చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం అందనుంది.
మస్కాపూర్ పాఠశాల నుంచి 30 మంది...
ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యధికంగా 30 విద్యార్థులు అర్హత సాధించారు. తర్వాత మామడ మండలం పొన్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 5 మంది అర్హత సాధించి రెండోస్థానంలో నిలిచారు. కొరిటికల్ ప్రభుత్వ పాఠశాల నుంచి 4 విద్యార్థులు, నర్సాపూర్(జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి 4 విద్యార్థులు ఎంపికయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
గతం కన్నా పెరిగిన సంఖ్య....
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గతేడాది 68 మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఈసారి 70 మంది ఎంపికయ్యారని అధికారులు తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా సమాచారం...
ఉన్నత పాఠశాల అర్హతసాధించిన విద్యార్థులు
మస్కాపూర్ 30
పొన్కల్(మామడ) 05
కొరిటికల్(మామడ) 04
నర్సాపూర్(జి) 04
మామడ 03
కడెం 03
బీరవెల్లి(సారంగాపూర్) 03
రాజూరా(ఖానాపూర్) 02
లక్ష్మణచాంద 02
మంజులాపూర్(నిర్మల్ అర్బన్) 02
సోమవార్‌పేట్(నిర్మల్ అర్బన్) 02 న్యూరేవోజిపేట్ ఎంపీయూపీఎస్(దస్తురాబాద్) 01 మున్యాల్(దస్తూరాబాద్) 01
లింగాపూర్(ఖానాపూర్) 01
కుభీర్ 01
టీఎస్‌ఎంఎస్ కుంటాల 01
వడ్యాల్ 01
ఎడ్‌బిడ్(ముధోల్) 01
పెంబి ఉన్నత పాఠశాల 01
జాఫ్రాపూర్(సోన్) 01
తానూర్(బోసి) 01
ఎన్‌ఎంఎంఎస్‌లో మెరిశారు
ఎన్‌ఎంఎంఎస్‌లో మెరిశారు
ఎన్‌ఎంఎంఎస్‌లో మెరిశారు


