ఐక్యరాజ్యసమితి లక్ష్యాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఐక్యరాజ్యసమితి లక్ష్యాలపై అవగాహన

Mar 12 2026 7:14 AM | Updated on Mar 12 2026 7:14 AM

బాసర: బాసర ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్‌ లోని ఎస్‌డీజీ సెల్‌ విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (ఎస్‌ టీఈఎం) విద్య, ఐక్యరాజ్యసమితి లక్ష్యాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచడం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై అవగాహ న కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. అవగాహన పెంచడం, చర్చలో పాల్గొనడం, సమస్యలపై నిర్ణయాత్మక చర్య తీసుకోవడం వంటి మూడు ముఖ్య సూత్రాలను ప్రాధాన్యంతో వివరించారు. ప్రపంచ స్థాయిలో పేదరికం, విద్య లో పం, జల సంక్షోభం వంటి సమస్యలను ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు ఎలా పరిష్కరిస్తాయో వివరించారు. కార్యక్రమాన్ని సాయికిరణ్‌, హృషికేష్‌, శ్రావణ్‌, మనీష్‌ జావేద్‌ నిర్వహించారు. తర్వాత విద్యార్థులను పోటీ ప్రపంచానికి సిద్ధంచేసే ప్రయత్నంగా ఎస్‌టీఈఎం, ఎస్‌డీజీ లక్ష్యాలపై ఆధారపడిన క్విజ్‌ పోటీ నిర్వహించారు. ఎస్‌డీజీ సెల్‌ బృందాన్ని ఆర్జీయూకేటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌, ప్రొఫెసర్‌ మురళీదర్శన్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement