సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అండ్ జూనియర్ కాలే జీ సోఫీనగరలో పీజీ టీగా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి భర్తను కాంట్రాక్ట్ పద్ధతిన కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించినట్లు తెలిసింది. ఈ నియామకం పారదర్శకతను పాటించకుండా జరిగిందని, ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను అడిగితే రిక్రూట్మెంట్ ఏజెన్సీని అడగాలని తెలిపారు. ఉపాధ్యాయురాలి భర్త అని తెలిసి విధుల్లోకి తీసుకున్న ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పనిషత్ నాయకుడు కొట్టూరి ప్రవీణ్‌కుమార్ కలెక్టర్‌ను కోరారు.


