ఇబ్బంది పెట్టారు | - | Sakshi
Sakshi News home page

ఇబ్బంది పెట్టారు

Mar 3 2026 7:23 AM | Updated on Mar 3 2026 7:23 AM

పరీక్ష పత్రం రీ వ్యాల్యువేషన్‌ను చాలెంజ్‌ చేస్తే నన్ను వేధించారు. యూనివర్సిటీ సిబ్బంది నా ఫోన్‌ లాక్కున్నారు. నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. సెక్యూరిటీ సిబ్బందిని ఇచ్చి ఇంటి వరకు పంపించారు. బలవంతంగా వారికి నచ్చినట్లు నాతో లేఖలు రాయించుకున్నారు. నన్ను ఇబ్బంది పెట్టిన వారికి శిక్ష పడే వరకు నేను పోరాటం చేస్తాను. – మనీశ్‌రెడ్డి, విద్యార్థి

అందరినీ వేధిస్తున్నారు

బాసర ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించిన అందరినీ అధికారులు వేధిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశాం. వర్సిటీ అధికారులు సమస్యలు చెబితే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.

– ఆకాశ్‌యాదవ్‌, విద్యార్థి సంఘం నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement