న్యూస్‌రీల్
ట్రిపుల్ ఐటీలో వారం రోజులుగా ఉద్రిక్తత ఆందోళనలు, ఆరోపణలు, ఫిర్యాదులు క్యాంపస్ నిధులపై శ్వేతపత్రానికి విద్యార్థుల డిమాండ్ ప్రశ్నించిన విద్యార్థిని టార్గెట్ చేస్తున్న అధికారులు
వసూళ్లకు ఫుల్‌స్టాప్
నిర్మల్ పట్టణంలో చిరువ్యాపారులపై కొత్త మున్సిపల్ పాలకవర్గం భారం తగ్గించింది. ఫిబ్రవరి 27న జరిగిన తొలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
సమస్యలపై సమరం
భైంసా : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ లొల్లి మొదలైంది. వారాలుగా విద్యార్థుల్లో అసంతృప్తి పెరుగుతోంది. క్యాంపస్ నిధుల వాడకం, పరీక్ష విధానాల పై నిత్యం నిరసన తెలుపుతన్నారు. అధికారులను ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యంపై ఆరోపణలు పెరుగుతున్నాయి. క్యాంపస్ బడ్జెట్ వివరాలను బహిర్గతం చేయాలని, శ్వేతపత్రం డిమాండ్ విద్యార్థులు చేస్తున్నారు. యాజమాన్యం ఆరోపణలను తిరస్కరించినా, ఆదివారం రాత్రి గోదావరి హాస్టల్ ముందు వందల మంది సమావేశమై నిరసన వ్యక్తం చేశా రు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశమైంది.
మనీశ్‌రెడ్డి ఘటనతో..
పరీక్ష పత్రాల రీ వెరిఫికేషన్ విషయంపై ప్రశ్నించిన విద్యార్థి నాయకుడు మనీశ్‌రెడ్డి ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనను తనిఖీ చేశారని, తనతో అధికారులు, సిబ్బంది బలవంతంగా లేఖలు రాయించారని రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని సంప్రదించాడు. ఇది క్యాంపస్ పరిపాలనపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో అధికారులు, విద్యార్థుల మధ్య వైరానికి కారణమైంది.
ప్రశ్నిస్తే బెదిరింపులు?
అధికారుల అక్రమాలు, ఏకపక్ష నిర్ణయాలను ప్రశ్ని స్తే పరిపాలనా ఒత్తిడి పెరుగుతోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఫోన్లు తనిఖీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదులు చేశారు. టీఏ ఎస్‌ఎస్ నేతృత్వంలో ఆదివారం రాత్రి గోదావరి బాలుర హాస్టల్ ఎదుట భారీ సమావేశం జరిగింది. వందల మంది విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి వరకు సమావేశం కొనసాగింది. ‘సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాడతా మని నినాదాలు చేశారు.
మంత్రులు హామీలు ఇచ్చి...
గతంలో బాసర క్యాంపస్‌కు వచ్చిన రాష్ట్ర మంత్రులు పలు హామీలు ఇచ్చారు. విద్యార్థులను కలిసి వారి సమస్యలపై క్షేత్రస్థాయిలో మార్పులు కనిపించడం లేదని విద్యార్థులు అంటున్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని విద్యార్థి నాయకులు పేర్కొంటున్నారు.
మానవ హక్కుల సంఘాల దృష్టి...
క్యాంపస్ పరిస్థితులపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు ఇక్కడి విద్యార్థులు వెళ్లి ఫిర్యాదులు చేశారు. క్యాంపస్ ఘటనలపై త్వరలోనే విచారణలు జరుగుతాయనే చర్చ ఉంది. భవిష్యత్తుపై భయంతో కొంతమంది విద్యార్థులు బహిరంగంగా ముందుకు వచ్చేందుకు సంకోచిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వారం రోజుల పరిణామాలు బాసర ట్రిపుల్ ఐటీని మరోసారి వార్తల్లో నిలిపాయి.
ఆదివారం రాత్రి గోదావరి హాస్టల్
వద్ద సమావేశమైన విద్యార్థులు
భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల అసంతృప్తి ఉధృతమవుతోంది. క్యాంపస్‌లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారంలో యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి విద్యార్థులు భారీగా సమావేశమయ్యారు. టీఎస్‌ఏఎస్ (తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ) ఆధ్వర్యంలో గోదావరి బాలుర హాస్టల్ ముందు నిర్వహించిన సమావేశం అర్థరాత్రి వరకూ కొనసాగింది. క్యాంపస్‌కు విడుదలవుతున్న నిధులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇక్కడి సమస్యలపై కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లకు విద్యార్థులు ఆశ్రయిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి సదుపాయాల లోపాలు, భోజన నాణ్యతపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత మూల్యాంకన విధానాలపై తీవ్ర అసంతృప్తి తెలిపారు. పరిపాలనలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలను విద్యార్థులు సభలో ప్రస్తావించారు. సమస్యలపై వినతులు స్వీకరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని తెలిపారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. టీఎస్‌ఏఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు యాజమాన్యాన్ని కలిసినట్లు తెలిపారు. అయినా స్పందన లేకపోవడంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ‘‘ఇది హెచ్చరిక మాత్రమే. అవసరమైతే దశలవారీగా ఆందోళనలను విస్తరిస్తాం’’ అని పేర్కొన్నారు. రాత్రి వేళ కూడా నినాదాలతో క్యాంపస్ మార్మోగింది.


