ఖానాపూర్: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినవారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన వారంతా క్షేమంగానే ఉన్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కుటుంబీకులకు ఫోన్ చేసి క్షేమ సమాచారం ఇస్తున్నారు. ఖానాపూర్ మండలానికి చెందిన రాజేశ్, తిరుమలేశ్, శ్రీకాంత్, తదదితరులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో ఉన్నామని తెలిపారు. తాము పనిచేసే జుఫర్ బెహరన్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు.


