ఉపాధిహామీలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీలో ఎఫ్‌ఆర్‌ఎస్‌

Mar 6 2026 8:10 AM | Updated on Mar 6 2026 8:10 AM

నిర్మల్‌ రూరల్‌: ఉపాధి హామీ పథకంలో ఎఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రక్రియ ప్రారంభమైంది. డీఆర్డీవో విజయలక్ష్మి సోన్‌ మండలం గంజాల్‌లో ఈ ప్రక్రియను గురువారం పరిశీలించారు. ఉద యం 6 గంటలకు వచ్చిన ఉపాధి హామీ కూ లీలను ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ద్వారా సంబంధిత ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఈ కేవైసీ చేస్తారు. అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు కూడా తప్పకుండా మరోసారి ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఈకేవైసీ ద్వారా ఫొటో దిగి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని అధికా రులు తెలిపారు. తప్పనిసరిగా రెండుసార్లు ఈ ప్రక్రియ చేస్తేనే కూలీలకు డబ్బుల ను చెల్లిస్తారు. ఒకసారి చేయకపోయినా సగం కూలి మాత్రమే చెల్లిస్తారు. ఈ ప్రక్రియతో నాణ్యత పెరిగి నకిలీలను అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. డీఆర్డీవో వెంట ఏపీవో రామకృష్ణ, డీఆర్పీ గంగ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement