ఎస్‌వో, ముగ్గురు సీఆర్టీల సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌వో, ముగ్గురు సీఆర్టీల సస్పెన్షన్‌

Mar 6 2026 8:10 AM | Updated on Mar 6 2026 8:10 AM

● బడికి ఆలస్యంగా వచ్చినందుకు చర్యలు ● నిర్మల్‌ అర్బన్‌ కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిర్మల్‌ రూరల్‌: పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు ఎస్‌వో, ముగ్గురు సీఆర్టీలను కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఉదయం 8:30 గంటలకు జిల్లా కేంద్రంలోని అర్బన్‌ కేజీబీవీని డీఈవో భోజన్నతో కలిసి తనిఖీ చేశారు. మొదట పాఠశాలలోని వంటగది, స్టోర్‌ రూం, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. స్టోర్‌రూంలో ఉంచిన బియ్యం, వంటనూనె, పప్పులు, కూరగాయలను పరిశీలించారు. మెస్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే అల్పాహారం నాణ్యతను పరిశీలించారు. రిజిస్టర్లు, స్టాక్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంత రం విద్యార్థులతో కలిసి అసెంబ్లీలో పాల్గొన్నారు. అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చిన ఎస్‌వో సుజాత, పీజీ సీఆర్టీలు కవిత, సంతోషిమాత, సీఆర్టీ శైలజపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురిని సస్పెండ్‌ చేయాల ని డీఈవోను ఆదేశించారు. ఉపాధ్యాయులు విధి ని ర్వహణలో అలసత్వం, సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హె చ్చరించారు. అనంతరం విద్యార్థులతో ముఖాము ఖి నిర్వహించి పాఠశాలలో అందుతున్న వసతులు, విద్యాబోధన, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. ఇందులో తహసీల్దార్‌ రాజు, ఎస్‌వో లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

రూరల్‌ కేజీబీవీని తనిఖీ చేసిన డీఈవో..

జిల్లా కేంద్రంలోని రూరల్‌ కేజీబీవీని డీఈవో భోజ న్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సరుకులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement