ఈజీగా గణిత బోధన
ఘనాపాఠి కరీం.. తోలుబొమ్మలతో ఎల్లన్న విద్యా విప్లవం రాష్ట్రస్థాయి సెమినార్‌లో ప్రతిభ జాతీయ స్థాయికి ఎదిగిన ఉపాధ్యాయులు బోధనకు వన్నెతెచ్చిన గురువులు
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ జెడ్‌పీహెచ్‌ఎస్(పీఎంశ్రీ) గణిత ఉపాధ్యాయుడు సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీం విద్యార్థుల్లో డిజిటల్ విద్యపై ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించిన డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అ మలు చేసి విద్యార్థులకు అభ్యాసక్రమాల్లో మార్పులు తీసుకువచ్చారు. శిక్షణ సెషన్లకు హాజరై, పైథాన్ ప్రోగ్రామింగ్‌ను పాఠశాల విభాగంలో ప్రవేశపెట్టి సాంకేతిక నైపుణ్యాలను పెంచారు. పాఠశాల విద్యార్థులను రెండు బృందాలుగా విభజించి 2025 జిల్లా సైన్స్ ఫెయిర్‌లో పైథాన్ ఆధారిత ప్రాజెక్టులతో వి జయం సాధించేలా మార్గదర్శకత్వం వహించారు.
35 మంది విద్యార్థులకు
మద్రాస్ ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు..
కరీం ప్రత్యేక కృషితో పాఠశాలలో 35 మంది విద్యార్థులు మద్రాస్ ఐఐటీ నిర్వహించిన ఫౌండేషన్ కోర్సుల్లో చేరి 8 వారాల్లో పూర్తి చేశారు. రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంత మంది సర్టిఫికెట్లు పొందడం విశేషం. కలెక్టర్ అభిలాష అభినవ్ పాఠశాల సందర్శించి విద్యార్థులను, వర్చువల్ ల్యాబ్ సౌకర్యాలను అభినందించారు.
వినూత్న బోధనా పద్ధతులు
గణిత బోధనలో జియోజిబ్రా, రోబోకాంపాస్ వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించి సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థం చేసుకునేలా చేస్తున్నారు. 2025 మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2026 ఫిబ్రవరి 19న ఎస్‌సీఈఆర్టీ రాష్ట్రస్థాయి గణిత సెమినార్‌లో ’గణితంలో పైథాన్ వాడకం’ అంశంపై ప్రదర్శనకు ప్రశంసలు అందుకున్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి..
మారుతున్న కాలనీకి అనుగుణంగా (ఎన్‌ఈపీ–2020) కి అనుగుణంగా విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్ బోధనలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. విద్యాశాఖ ఆదేశాలతోపాటు డీఈవో, హెచ్‌ఎం, తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నూతన బోధనల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. భవిష్యత్తుల్లో పాఠశాల విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేందుకు కృషిచేస్తా.
– సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీం,
గణిత ఉపాధ్యాయుడు
ఈజీగా గణిత బోధన


