వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది.
విధులతోపాటు ఆరోగ్యం ముఖ్యం
నిర్మల్‌టౌన్: పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణ ఎంత ముఖ్యమో.. ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ జానకీషర్మిల అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ఏఆర్ హెడ్ క్వా ర్టర్స్‌లో సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వు పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ శనివారం నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్‌డ్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్‌ను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్‌తో సిబ్బందికి ఫిజి కల్ ఫిట్నెస్‌తోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. స మయం దొరికినప్పుడు సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని సూ చించారు. ఫిట్నెస్‌ను నిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీసులు క్రమశిక్షణతో డ్యూటీలు నిర్వర్తించాలని, జిల్లాకు తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ పరేడ్‌లో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, సీఐలు నైలు, కృష్ణ, సమ్మయ్య, రామ్ నిరంజన్, రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


