వైద్యుల నిరసన
నిర్మల్‌ఖిల్లా: ఇటీవల హైదరాబాద్‌లో పిల్లల డాక్టర్ అభిషేక్‌పై జరిగిన భౌతిక దాడి చేశారు. దీనిని నిరసిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు నిర్మల్ వైద్యులు శనివారం డాక్టర్ లేన్‌లో నిరసన కా ర్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండించారు. బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకో వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యవృత్తిపై ఉన్న గౌరవాన్ని కాపాడాలని, ఆస్పత్రుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని కో రారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్ట ర్ మురళీధర్, డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ రమేశ్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ పోలిశెట్టి సంతోష్, డాక్టర్ రమణగౌడ్, డాక్టర్ సుచిన్ పాల్గొన్నారు.


