ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

Mar 8 2026 7:21 AM | Updated on Mar 8 2026 7:21 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ నరసింహారెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు పట్టణంలోని ఓ హోటల్‌లో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం వివరాలను లబ్ధిదారులకు తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి వ్యాపారంలో ఎదిగేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించేలా ఎదుగుతారన్నారు. ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించి అవసరమైన మెలుకువలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్డీఎం రామ్‌గోపాల్‌, ఇండియన్‌ పోస్ట్‌ మేనేజర్‌ వీరస్వామి, పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రయాదవ్‌, స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ దినేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement