● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజల వద్దకు మరింత మెరుగ్గా చేరవేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై కలెక్టర్లు, అధికారులతో హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూమ్ కాల్ ద్వారా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు విజయవంతంగా పూర్తి చేయాలని, అన్ని కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలన్నారు. ఈ నెల 12న, సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామంలోని ఆదిత్య గార్డెన్స్‌లో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


