ఫోన్‌ పోతే ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌ పోతే ఆందోళన వద్దు

Feb 28 2026 7:13 AM | Updated on Feb 28 2026 7:13 AM

ఫోన్‌ పోతే ఆందోళన వద్దు

ఫోన్‌ పోతే ఆందోళన వద్దు

నిర్మల్‌టౌన్‌: మొబైల్‌ ఫోన్‌ పొతే ఆందోళన చెందొద్దని, పోలీస్‌ స్టేషన్‌లో లేదా మీసేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించా రు.https://www.ceir.gov.in/ వెబ్‌పోర్టల్‌ ద్వారా ఫోన్‌ ఆచూకీ తెలుసుకోవడం సులభమన్నారు. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న రూ.9.44 లక్షల విలువైన 82 మొబైల్‌ ఫోన్లు సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌ ద్వారా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కార్యాలయంలో వాటిని శుక్రవారం బాధితులకు అందజేశారు. సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌లో ఐఎంఈ ఐ నంబర్‌ నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు పోయిన 2,006 ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు.

నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు చేయాలి

నేరస్తులకు శిక్ష పడేలా కేసుల దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో కలిసి డిస్ట్రిక్‌ ప్రాసిక్యూటర్‌ రివ్యూ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. గ్రేవ్‌ కేసుల్లో కోర్టులలో వచ్చిన తీర్పులపై సమీక్ష చేశారు. కేసులు విముక్తి కావడానికి కారణాలు, దర్యాప్తు లోపాలు సాక్ష్యాధారాల సమర్పణలో ఉన్న సమస్యలు, సాక్షుల హాజరు, ప్రాసిక్యూషన్‌ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. సంబంధిత కేసుల్లో అప్పీల్‌కు వెళ్లే అవకాశాలపై న్యాయపరమైన అంశాలను పరి శీలించి, అవసరమైనచోట చర్యలు తీసుకోవాల ని నిర్ణయించారు. కోర్టు విచారణలో సాంకేతిక ఆధారాలు వినియోగించడంపై అధికారులు దృష్టిసరించాలని స్పష్టం చేశారు. అనంతరం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను సత్కరించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ ఉపేందర్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు సుదర్శన్‌రెడ్డి, సతీశ్‌, అరుణ, దేవేందర్‌, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ సమ్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement