విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి | - | Sakshi
Sakshi News home page

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

Mar 14 2026 7:27 AM | Updated on Mar 14 2026 7:27 AM

నిర్మల్‌ఖిల్లా: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొ నే నైపుణ్యం ప్రతి ఒక్కరికీ అవసరమని జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) అధికారులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో శుక్రవారం 10వ బెటాలియన్‌ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విపత్తుల వేళ చేపట్టాల్సిన చర్యలపై ఎ న్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ మన్మోహన్‌ యాద వ్‌ తన బృందంతో భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు తదితర విపత్తుల సమయంలో ఎలా స్పందించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే అంశాలపై ప్రదర్శన నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించే విధానాన్ని వివరించారు. గాయపడిన వారికి తక్షణ సాయం అందించేందుకు సీపీఆర్‌ విధానంపై విద్యార్థులతో ప్రదర్శన ఇప్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సుధాకర్‌, జిల్లా అగ్నిమాపక అధికా రి ప్రభాకర్‌, జిల్లా క్రీడల అధికారి కాంత్‌రెడ్డి, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి అర్చన, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ జాకీర్‌ హుస్సేన్‌, అధ్యాపకులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement