బాసర: ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం తరలింపును అడ్డుకునేందుకు ఏఎస్పీ పర్యవేక్షణలో బాసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బిద్రెల్లి వద్ద చెక్‌పోస్టు గురువారం ఏర్పాటు చేశారు. ఏఎస్పీ రాజేశ్‌మీనా మాట్లాడుతూ ఈ చెక్ పోస్ట్ 24 గంటలు పోలీసులు డ్యూటీ చేస్తూ నిజామాబాద్ ధర్మబాద్ వైపు నుంచి వస్తున్న వాహనాలు తనిఖీ చేస్తారన్నారు. అక్రమంగా ఇసుక, రేషన్ బియ్యం తరలిస్తే సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ రవీందర్‌నాయక్, బాసర ఎస్‌హెచ్‌వో సీఐ కిరణ్, ఎస్సై నవనీత్‌రెడ్డి ఉన్నారు.


