ప్రభుత్వాస్పత్రిలో వసతులు బాగున్నాయా? | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రిలో వసతులు బాగున్నాయా?

Feb 28 2026 7:13 AM | Updated on Feb 28 2026 7:13 AM

ప్రభుత్వాస్పత్రిలో వసతులు బాగున్నాయా?

ప్రభుత్వాస్పత్రిలో వసతులు బాగున్నాయా?

● అడ్మినిస్ట్రేటివ్‌ డీఎంఈ శివరామ ప్రసాద్‌ ఆరా ● జీజీహెచ్‌, ప్రసూతి ఆస్పత్రి తనిఖీ

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రిలో మౌలిక వసతులపై అడ్మినిస్ట్రేటివ్‌ డీఎంఈ శివరామ ప్రసాద్‌ ఆరా తీశారు. శుక్రవారం రెండు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఏయే సదుపాయాలు ఉన్నాయి, ప్రతీరోజు ఎన్ని ఓపీలు నిర్వహిస్తున్నారు, మెరుగైన వసతులు ఉన్నాయా, డయాలసిస్‌, ఐసీయూలో విధులు ఎలా ఉన్నాయి, రోగులకు సకాలంలో వైద్యసేవలు అందిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రసూతి ఆస్పత్రిలో మెరుగైన ఓపీ సేవలు, రేడియాలజీ సేవలతోపాటు చిన్నారుల కోసం ఎస్‌ఎన్‌సీయూ సేవలు బాగున్నాయన్నారు. నీటి సమస్య తీర్చేందుకు సంపు ఏర్పాటు చేస్తామన్నారు. జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు కాంట్రాక్ట్‌ పద్ధతిన భర్తీ చేస్తామని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మందుల కొరత లేకుండా చూస్తామన్నారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. ఆయన వెంట డాక్టర్‌ సాయినాథ్‌రెడ్డి, డాక్టర్‌ సింధు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సీవీ.శారద, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ గోపాల్‌సింగ్‌, ప్రసూతి ఆస్పత్రి హెచ్‌వోడీ డాక్టర్‌ సరోజ, ఆర్‌ఎంవో సమత, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌కుమార్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ గ్రేట్‌–2 విజయలక్ష్మి, వివిధ విభాగాల హెచ్‌వోడీలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement