మార్కెట్‌లో లభించే ఫైవ్‌స్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్ పరికరాలు కొనుగోలు చేసి ఉపయోగించాలి.
ఇంట్లో టీవీలు, బల్బులు, ఫ్యాన్లు, కూలర్లు అవసరం లేనపుడు వాడకూడదు.
ఎల్‌ఈడీ బల్బులే వినియోగించాలి.
ఫ్రిజ్ డోర్లు వీలైనన్ని తక్కువసార్లు తెరవాలి.
బోరు మోటర్ ఆన్ చేసినపుడు ట్యాంక్ నిండగానే ఆఫ్ చేయాలి.
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం 200 యూని ట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికే గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేస్తోంది. జిల్లాలో చా లామంది వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చలికాలంలో చాలా గృహాల్లో ఏ సీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడకపోవడంతో విద్యు త్ వినియోగం బాగా తగ్గింది. వేసవికాలంలో ఇ వన్నీ అధికంగా వాడితే కరెంట్ వినియోగం 200 యూనిట్లు దాటితే గృహజ్యోతి పథకం వ ర్తించదు. అందుకే విద్యుత్ ఆదా చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో 2,45,496 గృహ కనెక్షన్లు
జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 2,45,496 ఉన్నాయి. గత నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకుని 1,25,257 మంది లబ్ధిదారులు రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. వీరందరికీ రూ.3.59 కోట్ల రాయితీ లభించింది. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకుంటే విద్యుదుత్పత్తి భారం తగ్గుతుందని, వేసవిలో విద్యుత్ ఆదా చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వినియోగదారులకూ అవగాహన కల్పిస్తున్నారు.
గృహజ్యోతి లబ్ధిదారులు, సబ్సిడీ వివరాలు
నెల లబ్ధిదారుల సబ్సిడీ మొత్తం
సంఖ్య (రూ.లక్షల్లో)
జూన్ 1,15,682 రూ.493.44
జూలై 1,22,082 రూ.477.75
ఆగస్టు 1,22,926 రూ.487.40
సెప్టెంబర్ 1,29,365 రూ.498.11
అక్టోబర్ 1,29,762 రూ.501.87
నవంబర్ 1,30,235 రూ.482.11
డిసెంబర్ 1,29,315 రూ.339.98
జనవరి 1,26,881 రూ.315.13
ఫిబ్రవరి 1,25,257 రూ.359.80
పొదుపు చేయడం ఇలా..
సెల్‌ఫోన్ చార్జింగ్ పూర్తయ్యాక చార్జర్‌ను ప్లగ్ నుంచి తొలగించాలి.


