న్యూస్‌రీల్
చేతిలోనే.. ‘మీ టికెట్’
ఇకపై బస్సు టికెట్ కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ద్వారానే ‘మీ టికెట్’ యాప్‌లో బుక్ చేసుకునే విధానాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది.
అభివృద్ధికి సహకరించండి
నిర్మల్‌టౌన్: నిర్మల్ పట్టణాభివృద్ధికి సహకరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా వును మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య, వై స్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి కోరారు. బుధవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి వే ణుగోపాలాచారితో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. నిర్మల్ పట్టణంలోని చారిత్రక శ్యామఘడ్, బత్తి స్‌ఘడ్‌ను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చే యాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
నిర్మల్‌చైన్‌గేట్: లాభసాటి వ్యవసాయం, చీడపీడల నివారణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదికలు నిర్మించింది. కొన్ని నెలలుగా ని ధులు మంజూరు నిలిచి వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వం ఆగస్టు–2022 వరకు నిర్వహణ నిధులు మంజూరు చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి నిలిచిపోయాయి.
జిల్లాలో 79 రైతువేదికలు
గత ప్రభుత్వం 2020లో ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌కు ఓ రైతు వేదిక నిర్మించింది. ప్రతీ 5వేల మంది కర్షకులకు రెండు నుంచి నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి వ్యవసాయశాఖ ద్వారా రూ.12లక్షలు, ఉపాధిహామీ పథకం కింద రూ.10లక్షలు వెచ్చించారు. జిల్లాలో 79 రైతువేదికలు నిర్మించగా నిర్వహణ కోసం నెలకు రూ.3వేల చొప్పున మంజూరు చేస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులు చాలవని వ్యవసాయశాఖ నివేదించడంతో రూ.9వేల చొప్పున విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత 2022 నవంబర్‌లో ఐదు నెలలకు సంబంధించి ఒక్కో వేదికకు రూ.45వేల చొప్పున విడుదల చేసింది. ఇక అప్పటి నుంచి అంటే చెల్లింపులు నిలిచిపోయాయి. 40 నెలలుగా నిధులు మంజూరు కాకపోవడంతో ఒక్కో రైతు వేదికకు ఇప్పటి వరకు రూ.3.60లక్షల నిధులు రావాల్సి ఉంది. అంటే జిల్లాలోని 79 రైతువేదికలకు నిర్వహణ నిధుల కింద రూ.2కోట్ల 84లక్షల 40వేలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయినప్పటికీ రైతువేదికల నిర్వహణ తప్పనిసరి కావడంతో ఏఈవోలు సొంతంగా వెచ్చిస్తూ అప్పుల పాలవుతున్నారు.
క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు..
జిల్లాలోని 18మండలాల్లో 79 క్లస్టర్లలో రైతువేదికలు నిర్మించి 79మంది ఏఈవోలకు విధులు అప్పగించారు. వీటి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో రైతువేదికకు రూ.9వేలు మంజూరు చేసి నిర్వహణ కొనసాగించింది. ఈ నిధులతో రైతువేదికల్లో తాగునీటి కోసం రూ.500, పారిశుధ్య నిర్వహణకు రూ.3వేలు, స్టేషనరీ కోసం రూ.వెయ్యి, కరెంట్ బిల్లు కోసం రూ.వెయ్యి, మరమ్మతుల కోసం రూ.వెయ్యి, నెలలో ఎనిమిదిసార్లు రైతులతో సమావేశాలు నిర్వహించనుండగా టీ, స్నాక్స్ కోసం రూ.2,500 ఖర్చు చేయాల్సి ఉంది.
జిల్లాలోని రైతువేదికల్లో కనీస వసతులు కానరావడం లేదు. ఏఈవోలు పంటలకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు కంప్యూటర్లున్నా విద్యుత్ బిల్లులు, మరమ్మతులకు నిధులు రావడం లేదు. ఉన్నతాధికారులకు పంపించాల్సిన నివేదికలు ప్రింట్ తీయడానికి ప్రింటర్లు కూడా లేవు. స్టేషనరీ, తాగునీటి ఖర్చులన్నీ ఏఈవోలే భరించాల్సి రావడం, సహాయకులు కూడా లేక అన్ని పనులు వారే చేయాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, శుభ్రం చేయించే బాధ్యత జీపీలు నిర్వహించాలని సూచించినా ఎక్కడా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా చాలాచోట్ల నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగమయ్యాయి. దీంతో మహిళా ఉద్యోగులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా రైతువేదికల పెండింగ్ నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఇప్పటినుంచి నెలానెలా నిధులు విడుదల చేయాలని ఏఈవోలు, రైతులు కోరుతున్నారు.
కనీస వసతులు కరువు
మంజూరు కాగానే చెల్లిస్తాం
కొన్ని నెలలుగా రైతువేదికలకు నిర్వహణ నిధులు ఆగిపోయాయి. నిర్వహణ లోపం లేకుండా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులతో రైతువేదికలను శుభ్రం చేయిస్తున్నాం. రైతులకు సేవలు అందించే విషయంలో సమస్యలు తలెత్తకుండా చూస్తాం. నిధులు మంజూరు కాగానే రైతువేదికల పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేస్తాం.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలోని రైతువేదికల వివరాలు
మండలాల సంఖ్య 18
రైతువేదికలు 79
ఒక్కోదానికి బకాయి రూ.3.60లక్షలు
మొత్తం బకాయిలు రూ.2.84కోట్లు


