కడెం: మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గిరిజనులకు పరిహారం కింద మండలంలోని పెత్తర్పు సమీపంలో సాగు భూములు కేటాయించారు. సదరు సాగు భూముల వద్ద ఈ నెల 3న పునరావాస గిరిజనులు, స్థానిక గొండుగూడ వాసుల మధ్య గొడవలు జరిగాయి. బుధవారం పునరావాస కాలనీని ఆర్డీవో రత్నకఽళ్యాణి, ఎఫ్‌డీవో శివకుమార్ సందర్శించి గిరిజనులతో సమావేశం నిర్వహించారు. అధికారుల తీరుకు నిరసనగా గిరిజనులు సమావేశ ఆనంతరం పాత మైసంపేట్‌కు తరలి అక్కడే వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సాగు భూముల గొడవలు లేకుండా చేసి, భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని, లేకుంటే పాత గ్రామంలోనే ఉంటామని స్పష్టం చేశారు. కాగా, గురువారం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వీరితో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. డీటీ లచ్చిరాం, ఎఫ్‌ఆర్వో గీతారాణి, సీఐ అజయ్, హైటీకాస్ ఎన్జీవో ఉమ్మడి జిల్లా ప్రతినిధి వెంకట్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.


