ఖానాపూర్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ టె ర్రరిస్ట్ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఐ (ఎం–ఎల్) న్యూడెమోక్రసీ నిర్మల్–ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి జే రాజు కోరారు. ఇరాన్ అధ్యక్షుడిని హత్య చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఖానాపూర్ పార్క్ చౌరస్తాలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికన్ సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల ను ఆపాలని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఖానా పూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, నిర్మల్ డివిజన్ కార్యదర్శి హరిత, నాయకులు దుర్గం లింగన్న, ఎల్‌ఆర్ ఉపాలి, కూడుదుల రాజేశ్, గోనె స్వామి, గూట్ల ప్రసాద్, శ్రీనివాస్, మల్లక్క గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


