నిర్మల్‌చైన్‌గేట్: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తం అయ్యేలా, విపత్తులను ఎదుర్కొనేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం, వరదల సమయంలో, ప్రకతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాలో అవగాహన కల్పించాలన్నారు. ఈమేరకు కార్యక్రమాల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. నిర్మల్ పట్టణంతోపాటు, వరద ప్రభావిత మండలాల్లో ముందస్తు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల ద్వారా సామాజిక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా, వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ముందస్తు అవగాహన కల్పిస్తే ప్రాణ, ఆస్తి నష్టాల నుంచి బయటపడవచ్చని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ మన్మోహన్‌యాదవ్, లైజనింగ్ ఆఫీసర్ జగదీష్, జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్, పరిశ్రమల శాఖ డీఎం నరసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


