ప్రకృతి సేద్యంతో ఆరోగ్యవంతమైన సమాజం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యంతో ఆరోగ్యవంతమైన సమాజం

Feb 28 2026 7:13 AM | Updated on Feb 28 2026 7:13 AM

ప్రకృతి సేద్యంతో ఆరోగ్యవంతమైన సమాజం

ప్రకృతి సేద్యంతో ఆరోగ్యవంతమైన సమాజం

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రకతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అన్నారు.జిల్లా కేంద్రంలోని బైల్‌ బజార్‌ రైతువేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ కింద ఎంపిక చేసిన ఐకేపీ మహిళలకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రసాయనాలతో కూడిన సాగు కంటే, శాశ్వత ప్రాతిపదికన సేంద్రియ పద్ధతులు పాటించడం ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయన్నారు. ఆర్గానిక్‌ పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయని తెలపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని వస్తృతం చేసేందుకు 15 క్లస్టర్లను ఎంపిక చేశామని, ప్రతీ క్లస్టర్‌ నుంచి ఇద్దరు ఐకేపీ మహిళలను ‘కృషి సఖి’లుగా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు గ్రామాల్లోని రైతులకు సేంద్రియ సాగు విధానాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రైతులు ప్రకతి వ్యవసాయం వైపు మళ్లేలా వారిని ప్రోత్సహించాలని జిల్లా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక షాపును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శిక్షణను పూర్తి చేసుకున్న ‘కృషి సఖి’ మహిళలకు కలెక్టర్‌ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చై ర్మన్‌ సోమ భీమ్‌రెడ్డి, అరణ్య సంస్థ ప్రతినిధులు ప ద్మ, నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి రమణ, అధికారులు, సిబ్బంది, ఐకేపీ మహిళలు పాల్గొన్నారు.

పంటనష్టం నివేదిక రూపొందించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని శాసీ్త్రయంగా అంచనా వేయాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరిగిన ప్రాథమిక అంచనాల ప్రకారం, జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారని తెలిపారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో, ప్రతీ పంట పొలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను యుద్ధప్రతిపాదికన సిద్ధం చేయాలని కలెక్టర్‌ సూచించారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement