పునరావాస సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

పునరావాస సమస్యలు పరిష్కరిస్తాం

Mar 6 2026 8:10 AM | Updated on Mar 6 2026 8:10 AM

● డీఎఫ్‌వో సుశాంత్‌ సుఖ్‌దేవ్‌బొబడే

కడెం: రాంపూర్‌, మైసంపేట్‌ పునరావాస గ్రామస్తుల సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని డీఎఫ్‌వో సుశాంత్‌సుఖ్‌దేవ్‌ బొబడే అన్నారు. సాగుభూమి కోసం ఇటీవల గొడవలు జరిగిన నేపథ్యంలో పునరావాస గ్రామాన్ని గురువారం సందర్శించారు. ప్రజలతో మాట్లాడారు. సాగునీరు, విద్యుత్‌ తదితర సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గిరిజనులు అందోళన విరమించాలని సూచించారు. సీఐ అజయ్‌, ఎస్సై సాయికిరణ్‌ అధ్వర్యంలో గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఇందులో ఎఫ్‌డీవో శివకుమార్‌, డీటీ లచ్చిరాం, ఆర్‌ఐ శారద, అటవీ రేంజ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement