లోకేశ్వరం: మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్, డీజిల్ లీక్ అవుతోందని, దీంతో తమ బోరు నీళ్లు వాసన వస్తున్నాయని బంక్ సమీపంలోని గడ్డం నరసింహరెడ్డి, గుడిసెల రాజేశ్వర్‌గౌడ్, రమేశ్‌గౌడ్ గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గురువా రం ముగ్గురు ఇళ్లకు వచ్చి బోరు వాటర్‌ను పరిశీలించారు. నమూనాలు సేకరించి జిల్లా జలవనరుల శాఖ జ్వలిస్టు నవనీత్‌కు పంపించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా జలవనరుల శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.


