వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు మృతి | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు మృతి

Feb 28 2026 7:13 AM | Updated on Feb 28 2026 7:13 AM

వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు మృతి

వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు మృతి

● ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన

ఆదిలాబాద్‌టౌన్‌: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన శుక్రవారం ఆదిలాబాద్‌ ప ట్టణంలోని బస్టాండ్‌ ఎదుట గల ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వి వరాల ప్రకారం.. భోరజ్‌ మండలం పెండల్వాడకు చెందిన ఓ గర్భిణీ వారం క్రితం ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. కాగా ఈనెల 23న మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉ న్నట్లు వైద్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం శిశువు పాలు తాగకపోవడంతో వైద్యులకు విష యం తెలిపారు. మధ్యాహ్నం పిడియాట్రీక్‌ వైద్యు డు వైద్యం కోసం మరో ఆసుపత్రికి ఆటోలో తమకు తెలియకుండానే శిశువును తరలించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తాము కూడా వెంట వెళ్లగా కాసేపటికే బిడ్డ మృతి చెందినట్లు అక్కడి వైద్యుడు చెప్పాడన్నారు. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement