వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావర ణం పొడిగా ఉంటుంది. చలి తగ్గుతుంది.
శివాజీ అడుగుజాడల్లో నడుచుకోవాలి
భైంసారూరల్: యువత ఛత్రపతి శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నడుచుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావు పటేల్ సూచించారు. ఆదివారం మండలంలోని పాంగ్రి గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ సామ్రాజ్య స్థాపనకు శివాజీ చేసిన పో రాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, దౌర్జన్యాలకు ఎదురు నిలిచి, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహోన్నత నాయకుడు అని కొనియాడారు. పాంగ్రి గ్రామంలో రాజ కోట నమూనాతో విగ్రహాన్ని ఏర్పాటు చేయ డం అభినందనీయమని పేర్కొన్నారు. సర్పంచ్ ఆకాశ్, భైంసా మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి, ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, ప్రజాట్రస్ట్ చైర్మన్ మోహన్‌రావు పటేల్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


