ఖానాపూర్: ఖానాపూర్ మండలంలో 2024–25లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ ప్రక్రియ ప్రారంభమైంది. మండలంలోని 25 గ్రామపంచాయతీల్లో ఈజీఎస్ ద్వారా రూ.10,32,26,847, పంచాయతీరాజ్ ద్వారా రూ.5,67,33,920, అటవీ శాఖ ద్వారా రూ.46,29,410 పనులు జరిగాయిరయి. ఈ పనులపై సామాజిక తనిఖీని ప్రారంభిస్తామని సోషల్ ఆడిట్ ఎస్‌ఆర్‌పీ మహేశ్ తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఈ నెల 7వ తేదీ నుంచి 14 టీంలు 14 మంది డీఆర్పీల ద్వారా పనులు జరిగిన ప్రాంతాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో తనిఖీ చేయడం జరుగుతందన్నారు. నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వివరాలే సేకరించనున్నట్లు వెల్లడించారు. అనంతరం తనిఖీ వివరాలను ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభలతోపాటు ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ప్రజావేదికలో వెల్లడిస్తామని వివరించారు. సంబంధిత అధికారుల నుంచి రికార్డులు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.


