● జిల్లాలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఖాళీలు ● నియామకాలు చేపట్టని సర్కారు ● పనుల నిర్వహణలో ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఖాళీలు ● నియామకాలు చేపట్టని సర్కారు ● పనుల నిర్వహణలో ఇబ్బందులు

Mar 2 2026 7:24 AM | Updated on Mar 2 2026 7:24 AM

● జిల్లాలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఖాళీలు ● నియామకాలు చేపట్

● జిల్లాలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఖాళీలు ● నియామకాలు చేపట్

● జిల్లాలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఖాళీలు ● నియామకాలు చేపట్టని సర్కారు ● పనుల నిర్వహణలో ఇబ్బందులు

నిర్మల్‌చైన్‌గేట్‌: వలసలను నివారించేందుకు గ్రామీ ణ నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉపాధిహా మీ పథకం నిర్వహణపై పర్యవేక్షణ కొరవడింది. జి ల్లాలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సాధారణంగా ఉపాధిహామీ పనుల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే వీరి సంఖ్య తక్కువగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పనుల ప ర్యవేక్షణ, డేటా సేకరణలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఉపాధిహామీ పథకంలో కూలీలకు పనులు కల్పించడం, మస్టర్ల కేటాయింపులు, పనుల పర్యవేక్షణ, జాబ్‌కార్డుల మంజూరు, ఆధార్‌ కార్డుల అనుసంధానం, వనమహోత్సవం, డేటా సేకరణ తది తర పనులను ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్వహిస్తుంటారు. ప్రతీ వేసవిలో ఉపాధి పనులకు కూలీలు అధికసంఖ్యలో హాజరవుతుంటారు. వివిధ కారణాలతో జిల్లాలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఖాళీలేర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలతోపాటు పలు పాత పంచాయతీల్లోనూ సరిపడా సిబ్బంది లేక పథకం అమలులో తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2018 నుంచి విడతల వారీగా జిల్లాలో 400 గ్రామ పంచాయతీలేర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో పాటు వివిధ కారణాలతో ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఖాళీలున్నాయి. 400 మంది క్షేత్ర సహాయకులకు ప్రస్తుతం జిల్లాలో 205 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 195 మంది క్షేత్రసహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్ల నియామకాలు చేపట్టనందున పక్కవారికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇస్తున్నారు. లేదా.. అనుభవమున్న సీనియర్‌ కూలీని మేట్‌గా గుర్తించి పనులు చేయిస్తున్నారు.

కార్యదర్శులకు బాధ్యతలు

కొత్త గ్రామపంచాయతీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లను నియమించని కారణంగా పంచాయతీ కార్యదర్శులే ఉపాధిహామీ పనులు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. కార్యదర్శులకు గ్రామపంచాయతీ పనులు ఉండటంతో ఉపాధి పనులపై సరిగా దృష్టి సారించలేకపోతున్నారు. పనుల్లో ఏ పొరపాటు జరిగినా పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాల్సిన పరిస్థితులేర్పడుతున్నాయి. కార్యదర్శులకు పూర్తిస్థాయి బాధ్యతలు లేకపోవడంతో ఉపాధి పనుల అమలులో పురోగతి లేకుండా పోతోంది. కొత్తపనులు కేటాయించడం, గ్రామసభలు, నర్సరీల నిర్వహణ, కూలీల వేతనాలు మంజూరు తదితర విషయాల్లో పర్యవేక్షణ లేక ఇబ్బందులెదురవుతున్నాయి. కూలీలు పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నా ఫీల్డ్‌ అసిస్టెంట్ల కొరతతో పథకం అమలులో ఇబ్బందులెదురవుతున్నాయి.

జిల్లా సమాచారం

మండలాల సంఖ్య 18

గ్రామపంచాయతీలు 400

ప్రస్తుత ఫీల్డ్‌ అసిస్టెంట్లు 205

ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఖాళీలు 195

జాబ్‌కార్డులు 1.28లక్షలు

ఉపాధి కూలీలు 2.19లక్షలు

100రోజుల పని పూర్తి చేసినవారు 574

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement