భైంసాటౌన్/భైంసారూరల్: ముధోల్ నియోజకవర్గానికి అదనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి విన్నవించారు. లబ్ధిదారుల ఎంపిక సమయంలో కొందరు ఇల్లు లేనివారిని కూడా సాంకేతిక కారణాలతో ఎల్–3 లిస్టు, ఎల్–2 లిస్టులో చేర్చినట్లు తెలిపారు. అర్హులకు న్యాయం జరిగేలా ఆ జాబితాలను సరిచేసి ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు విఠల్‌రెడ్డి తెలిపారు.
మంత్రికి వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి


