నిర్మల్‌చైన్‌గేట్: వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. జిల్లాల్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వివిధ శాఖలకు కేటాయించిన పనులన్నీ ప్రణా ళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సంయుక్త భాగస్వామ్యంతో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్‌రెడ్డి, షిండే ఆనంద్‌రావు పటేల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


