అ‘పూర్వ’ం.. అద్వితీయం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ం.. అద్వితీయం

Mar 2 2026 7:24 AM | Updated on Mar 2 2026 7:24 AM

అ‘పూర

అ‘పూర్వ’ం.. అద్వితీయం

కడెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1995–96 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదివిన వారంతా ఆదివారం మండల కేంద్రంలోని బృందావన్‌ రిసార్ట్స్‌లో కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉత్సాహంగా గడిపారు. అప్పటి గురువులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఖానాపూర్‌: పట్టణంలోని బాలికల జెడ్పీహెచ్‌ఎస్‌లో 2001–2002 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివినవారంతా స్థానిక జీవీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం పేరిట కలుసుకున్నారు. ఒకరికొకరు పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. పాఠశాలలో చదివిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సందడి చేశారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు.

అ‘పూర్వ’ం.. అద్వితీయం 1
1/1

అ‘పూర్వ’ం.. అద్వితీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement