కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి
ఖానాపూర్: ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య డిమాండ్ చేశా రు. ఆదివారం పట్టణంలోని తాపీమేసీ్త్రల సంఘ భవనంలో సంఘం అధ్యక్షుడు కడకుంట్ల నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఎత్తివేసే కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్ర భుత్వం కార్మికులను విస్మరిస్తోందని ఆరోపించారు. మ్యారేజ్, మెటర్నరీ పథకాలకు రూ.లక్ష వరకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన కార్మికుడికి రూ.6వేల పెన్ష న్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డును కాపాడాలని డి మాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సు నారికారి రాజేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు, మండల కార్యదర్శి చిలుకూరి ఇస్తారి, నాయకులు సురపాక రాజన్న, బోదాసు చిన్న నర్సయ్య, పోశెట్టి కోమటిపల్లి, భీమయ్య, దుర్గం లింగన్న, ఆడేపు గణేశ్, ఎల్‌ఆర్ ఉపాలి తదితరులున్నారు.


