ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక బృందాలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక బృందాలు

Mar 8 2026 7:21 AM | Updated on Mar 8 2026 7:21 AM

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: ఖానాపూర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై శని వారం సమీక్ష చేశారు. పంచాయతీరాజ్‌, రహదారులు–భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, కల్వర్టులు, వంతెనల పనుల్లో జాప్యం చేయొద్దని సూచించారు. అటవీ శాఖ అనుమతులతో ముడిపడి ఉన్న పనుల కోసం వెంటనే ‘పరివేశ్‌’ పోర్టల్‌లో దరఖాస్తు చేయాలన్నారు. ఖానాపూర్‌ పట్టణ పరిధిలో విలువైన ప్రభుత్వ భూ ముల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమగ్రంగా సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్కారు భూములను కబ్జా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి..

ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అటవీ క్లియరెన్స్‌ విషయంలో అధికారులు వేగంగా స్పందించాలని, అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తాను చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, జిల్లా అటవీ అధికారి సుశాంత్‌ సుఖదేవ్‌ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement