కడెం: మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్ సమీ ప మైసంపేట్ పునరావాస గిరిజనులకు కేటాయించిన వ్యవసాయ భూములవద్ద నచ్చన్‌ఎల్లాపూ ర్, గోండుగూడ గ్రామస్తుల మధ్య మంగళవా రం గొడవ జరిగింది. హోలీ సందర్భంగా భూ ముల వద్ద పూజలు చేయడానికి వెళ్లారు. అప్పటికే అక్కడ పూజలు చేసిన నచ్చన్‌ఎల్లాపూర్ వా సులను గోండుగూడ గ్రామస్తులు ఈ భూములు తమవని, మీరు ఎందుకు పూజలు చేశారని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు, అటవీశాఖ అధికారుల ఎంట్రీతో గొడవ సద్దుమణిగింది. ఘటన స్థలా న్ని ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్ పరిశీ లించారు. బందోబస్తును పర్యవేక్షించారు. తమ కు భూములు కేటాయించకపోతే తిరిగి మైసంపేట్‌కు వెళ్తామని తెలిపారు. ఏళ్లుగా ఆ భూములు తాము సాగుచేసుకుంటున్నామని తమకే ఇవ్వాలని గొండుగూడ వాసులు డిమాండ్ చేశారు.


