బాసర ఆలయంలో భర్తీకాని ఖాళీలు | - | Sakshi
Sakshi News home page

బాసర ఆలయంలో భర్తీకాని ఖాళీలు

Mar 4 2026 7:24 AM | Updated on Mar 4 2026 7:24 AM

ఉన్నవారినే సర్దుబాటు చేస్తున్న అధికారులు..

పండుగలు, ఉత్సవాలు, సెలవుల వేళ ఇబ్బంది..

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించని దేవాదాయ శాఖ

బాసర: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఒకటి. ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నప్పటికీ అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. బాసర దేవస్థానానికి రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌స్థాయి అధికారి ఈవోగా ఉండాలి. కానీ కొన్ని రోజులుగా అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి నియమిస్తూ వస్తున్నారు. అది కూడా పూర్తిస్థాయిలో కాకుండా ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు కలిగి ఉన్న అధికారిని నియమిస్తున్నారు. ఫలితంగా అసలే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు ఇది మరింత శాపంగా మారింది.

ఆలయ ప్రాముఖ్యత

కశ్మీర్‌ శారదా పీఠం తర్వాత భారతదేశంలో రెండో ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రం బాసర. గోదావరి తీరంలో చాళుక్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయం అక్షరా భ్యాస పూజలకు ప్రసిద్ధి చెందింది. భక్తుల రద్దీ పె రుగుతున్నా సౌకర్యాలు లోపిస్తున్నాయి. రెండు ఈ వో పోస్టులు ఖాళీగా ఉండటంతో రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి అంజనాదేవి అదనపు బాధ్యతలతో ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె కూడా సెలవుపై వెళ్లారు. ఇక ఏవో, సూపరింటెండెంట్‌, పర్యవేక్షకులు, సీనియర్‌–జూనియర్‌ అసిస్టెంట్ల పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఉన్నవారిపైనే భారం పడుతోంది.

పూజా సిబ్బంది కొరత

అర్చక–పరిచారకులు 10 పోస్టులు ఖాళీగా ఉండటంతో నిత్య పూజలు, అక్షర శ్రీకారాలు అరకొర సిబ్బందితో నడుస్తున్నాయి. 15 మంది రెగ్యులర్‌ వైదిక సిబ్బంది మాత్రమే ఉండటంతో రోజంతా పనిఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పదవీ విరమణలు జరిగినా కొత్త నియామకాలు చేయడం లేదు.

తాత్కాలిక ఏర్పాట్లు

వాగ్దేవి సొసైటీ ఆధ్వర్యంలో 90 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. శానిటేషన్‌, టికెట్‌ పంపిణీ, పూజా సహాయం వంటి విధుల్లో రాజకీయ పక్షపాతాలు ఉన్నాభ అనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల సౌకర్యాలు, ఆలయ పర్యవేక్షణ బాగా లోపించాయి.

ప్రభుత్వం దృష్టికి..

ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ అసెంబ్లీలో ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ అభివృద్ధి పనులు, సిబ్బంది భర్తీలకు త్వరి త చర్యలు అవసరమని భక్తులు, స్థానికులు డిమాండ్‌ చేశారు. అయినా దేవాదాయ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు.

బాసర ఆలయం..

పోస్టులు ఖాళీల సంఖ్య

ఈవో 2

పర్యవేక్షకులు 2

సీనియర్‌ అసిస్టెంట్లు 2

జూనియర్‌ అసిస్టెంట్లు 3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement