యూరియా కష్టాలు తీరేదెలా? | - | Sakshi
Sakshi News home page

యూరియా కష్టాలు తీరేదెలా?

Mar 2 2026 7:24 AM | Updated on Mar 2 2026 7:24 AM

యూరియా కష్టాలు తీరేదెలా?

యూరియా కష్టాలు తీరేదెలా?

● యాప్‌లో బుకింగ్‌పై అవగాహన కరువు ● సరిపడా దొరకక నష్టపోతున్న రైతులు

భైంసా: జిల్లా రైతులు యూరియా కోసం నానా పా ట్లు పడుతున్నారు. యూరియాను యాప్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉండగా రైతులకు సరిపడా అందని పరిస్థితి ఉంది. సారంగపూర్‌ మండల కేంద్రంలోని ఒక దుకాణానికి ఇటీవల 450 యూరియా బస్తాలు రాగా, 50 సెకన్లలోనే యాప్‌లో నో స్టాక్‌ సూచిస్తున్నట్లు రైతులు వాపోయారు. అప్పటివరకు దుకా ణం వద్దే ఉన్న రైతులు యూరియా దొరకక నిరాశతో వెనుదిరిగారు. ఖానాపూర్‌లోని గ్రోమోర్‌ ఫర్టిలైజర్‌ షాపులో యూరియా బుక్‌ చేసిన రైతులు రెండ్రోజులు నిరీక్షించినా ఇవ్వనట్లు తెలిసింది. మామ డ మండలంలోని పలువురు రైతులు ఈ కేంద్రానికి వచ్చి యూరియా దొరకక వెనుదిరిగి వెళ్లారు.

ఐదు నిమిషాల్లో స్టాక్‌ ఖాళీ

జిల్లాలోని మరికొన్ని మండలాల్లోనూ యాప్‌లో స్టాక్‌ అందుబాటులో ఉందని చూపించిన కొద్దిసేపట్లోనే ‘స్టాక్‌ లేదు’ అని మెసేజ్‌ వస్తోందని రైతులు వాపోతున్నారు. నిజంగా ఎంత స్టాక్‌ వచ్చింది, ఎవరు బుక్‌ చేసుకున్నారో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. యూరియా స్టాక్‌ ఎప్పుడు వచ్చిందో.. ఎంత వచ్చిందో ముందుగా సమాచా రం ఇవ్వడంలేదని పేర్కొంటున్నారు. దీంతో డీలర్‌ వద్దకు చేరుకునేసరికే స్టాక్‌ అయిపోతున్న పరిస్థితి ఎదురవుతోంది. ఇక, స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం తెలియని వృద్ధ రైతులు యాప్‌లో బుక్‌ చేసుకోవ డం తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు.

అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు

యూరియా స్టాక్‌ రాగానే ముందుగా తెలిసిన వ్యక్తు లే యాప్‌లో బుక్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. యూరియాతో పాటు ఇతర మందులు కొనుగోలు చేసేవారికే దుకాణాదారులు ప్రాధాన్యత ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి పారదర్శక విధానం అమలు చేయాలని కోరుతున్నారు. వ్యవసాయాధికారులు స్పందించి యాప్‌ లోపాలపై సాంకేతిక సమీక్ష చేయాలని, స్టాక్‌ వివరాలను రియల్‌ టైమ్‌లో స్పష్టంగా ప్రదర్శించాలని, ముందస్తు సమాచారం అందించే విధా నం అమలు చేయాలని, కౌలు రైతులకు ప్రత్యేక సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement